Wednesday, 16 September 2026 01:58:23 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు.

Date : 28 July 2026 07:09 PM Views : 466

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు.మెడికల్ బోర్డుపై ఏఐటీయూసీ వాదనకు స్పందించిన ఆర్‌ఎల్‌సీ. రీ-మెడికల్ పరిశీలించాలని యాజమాన్యానికి సూచన.ఆగస్టు 6లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 16 నుంచి అన్ని సంఘాలను కలుపుకొని సమ్మెకు వెళ్తాం: ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డా. సస్వతీ రాథ్ సమక్షంలో రెండో విడత చర్చలు జరిగాయి.ఏఐటీయూసీ తరఫున అధ్యక్షులు వి. సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె. రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం. రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, వై.వి. రావు, ఎం.సమ్మయ్య పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తరఫున డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) బి. రాజగోపాల్ హాజరయ్యారు.సమ్మె నోటీసులో ప్రధాన డిమాండ్‌గా ఉన్న మెడికల్ బోర్డు అంశంపై యాజమాన్యం ఇప్పటికే బోర్డు నిర్వహించామని తెలిపింది. అయితే, బోర్డు ద్వారా పరీక్షించిన కార్మికులను పారదర్శకంగా ఫిట్ లేదా అన్‌ఫిట్‌గా ప్రకటించకపోవడంతో అనేక మంది కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐటీయూసీ వాదించింది.వాదనలను విన్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్,ఈనెల 17,18 మెడికల్ బోర్డులో పరీక్షించిన కార్మికులకు రీ-మెడికల్ పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని యాజమాన్యానికి సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావులేకుండా మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని కూడా స్పష్టం చేశారు.అదేవిధంగా, తదుపరి చర్చలకు ముందే యాజమాన్యం, ఏఐటీయూసీ మధ్య ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని డిమాండ్లపై సానుకూలంగా చర్చించి, ఆ సమావేశ నివేదికను తదుపరి విచారణలో సమర్పించాలని ఆర్ ఎల్ సి ఆదేశించారు.ఇరు పక్షాలు పరస్పర చర్చల ద్వారానే సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్, తదుపరి విచారణకు నిర్ణయాధికారం కలిగిన అధికారిని యాజమాన్యం తప్పనిసరిగా హాజరుపరచాలని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తదుపరి చర్చలను ఆగస్టు 6, 2026 ఉదయం 11 గంటలకు వాయిదా వేసినట్టు తెలిపారు.అనంతరం ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 6న జరిగే చర్చల్లో సమస్యలకు సానుకూల పరిష్కారం లభించకపోతే ఆగస్టు 16 నుంచి సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతామని వాసిరెడ్డి సీతారామయ్యా,కొరిమి రాజ్ కుమార్ స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :