తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిప్యూటేషన్ పై జెవిఆర్ ఓసి లో పని చేస్తున్న కార్మికులను తిరిగి రప్పించాలి. గుర్తింపు సంఘం ఎఐటియుసి డిమాండ్. శుక్రవారం ఉదయం వికె ఓసిలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కొత్తగూడెం ఏరియా ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో ఓసి మేనేజర్ మురళి ని కలిసి కోరారు. అనంతరం బ్రాంచ్ కార్యదర్శి మాట్లాడుతూ వికె ఓసిలో బొగ్గు వెలికితీత సింగరేణి కార్మికులతోనే తీయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీకే ఓసి మూత పడిన తరువాత జెవిఆర్ ఓసి కి డిప్యుటేషన్ పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి పేరెంట్ మైన్ వికే ఓసి కి తీసుకురావాలని కోరారు. వికే ఓసి లో పంపు ఆపరేటర్ యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు పర్మినెంట్ డిసిగ్నేషన్ ఇవ్వాలని, సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని గుర్తింపు సంఘం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో వికే ఓసి పిట్ కార్యదర్శి ఏం ఆర్ కె ప్రసాద్, మెంగన్ రవి, కోటి, ప్రభాకర్,కార్మికులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ