Monday, 03 August 2026 07:07:34 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

“అరైవ్ – అ లైవ్” కార్యక్రమాల గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 13 April 2026 01:41 PM Views : 188

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించనున్న “అరైవ్ – అ లైవ్” కార్యక్రమాల గోడపత్రికను జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో మానవ తప్పిదాలే ప్రధాన కారణమవుతున్నాయని పేర్కొంటూ, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. “అరైవ్ – అ లైవ్” కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడం, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం లక్ష్యమని వివరించారు. హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం, అధిక వేగంతో వాహనాలు నడపకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండడం వంటి భద్రతా చర్యలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. యువత ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాల భాగంగాగ్రామసభలు,అవగాహన ర్యాలీలు, పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు, డ్రైవర్లకు శిక్షణ శిబిరాలు, ప్రజలకు అవగాహన కల్పించే వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ , సిబ్బంది మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :