తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం లీగల్ :: డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ కొట్టిన వ్యక్తికి జరిమానా విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తీర్పు చెప్పారు. 2023 జూలై 16 న కొత్తగూడెం త్రి టౌన్ కానిస్టేబుల్ కె.వేణుగోపాల్ అర్ధరాత్రి డ్యూటీ లో ఉండగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గర టీఎస్ - 28-5180 మోటార్ సైకిల్ మీద టేకులపళ్లికి చెందిన మాలోక్ అశోక్ రాగా ఆపి బ్రీత్ అనలైజర్ ను పెట్టి ఊదమనగా అనగా అందుకు నిరాకరించి, కింద పడి వేసి కొట్టగా తలకు బలమైన గాయమై,కుడి చేతి చిటికెన వేలుకు ఫ్రాక్షర్ అయినది. వెంటనే కొత్తగూడెం త్రి టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎమ్.సోమేశ్వర్ కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం ఛార్జిషీట్ చేశారు. కోర్టులో ఎనిమిది మంది సాక్షులను విచారించారు. మాలోతు అశోక్ పై నేరం రుజువు కాగా 4000/- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిస్క్యూషన్ ను పిడివిడి లక్ష్మి నిర్వహించగా, కొత్తగూడెం కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎస్. కె. ఘని (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పిసి బి.రవి లు సహకరించారు
Admin
తెలుగు వెలుగు టీవీ