తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదర సోదరీమణులకు అందిస్తున్న రంజాన్ కానుకలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వారి చేతుల మీదుగా అందజేశారు అనంతరం ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శాంతి సహనం దాన ధర్మాలకి ప్రతీక అని తెలిపారు సమాజంలో సోదరభావం పెంపొందించేందుకు ఈ రంజాన్ పండుగ ఎంతో ముఖ్యమైనదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ