Tuesday, 03 November 2026 07:29:29 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

అధికారుల వైఖరి మారాలి.. లేకపోతే పదవులు మారే పరిస్థితి వస్తుంది - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Date : 04 September 2026 10:52 AM Views : 162

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : అధికారుల వైఖరి మారాలి.. లేకపోతే పదవులు మారే పరిస్థితి వస్తుంది... రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే భూ భారతి అధికారాలు.. స్వప్రయోజనాలకు వాడితే కఠిన చర్యలు రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే రైతులను చులకనగా చూస్తే సహించేది లేదు సాదా బైనామా, భూ భారతి దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచితే చర్యలు తప్పవు 22-ఏను అడ్డుపెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు.. అనవసర భూములను వెంటనే తొలగించాలి భూ రీ-సర్వేలో రైతుల నుంచి ఒక్క పైసా వసూలు చేసినా కఠిన చర్యలు 125 ఏళ్ల తర్వాత చేపడుతున్న సమగ్ర భూ రీ-సర్వేను మూడు దశల్లో పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇండ్లలో అనర్హులకు మంజూరు చేస్తే కలెక్టర్లదే బాధ్యత సెప్టెంబర్ 15లోగా 2-బీహెచ్‌కే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి.. లేదంటే కేంద్ర నిధులు కోల్పోయే ప్రమాదం భూ భారతి, 22-ఏ, భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లపై ఖమ్మం–భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో సమీక్షించిన మంత్రి పొంగులేటి రెవెన్యూ శాఖలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారుల వైఖరి మారాలని, లేకపోతే వారి పదవులు మారే పరిస్థితి వస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూ రీ-సర్వే, రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం ద్వారా అధికారాలను క్షేత్రస్థాయికి వికేంద్రీకరించిందని, ఆ అధికారాలను స్వప్రయోజనాలకు వినియోగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ధరణి వ్యవస్థలో అత్యధిక అధికారాలు కలెక్టర్ వద్దే ఉండేవని, అయినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అందుకే భూ భారతి చట్టం ద్వారా అధికారాలను తహసీల్దార్ స్థాయి వరకు వికేంద్రీకరించామని తెలిపారు. అయితే క్షేత్ర స్థాయి అధికారులు ఆ అధికారాలను ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా స్వ ప్రయోజనాలకు ఉపయోగిస్తుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులను నెలల తరబడి ‘కోల్డ్ స్టోరేజ్’లో ఉంచొద్దు: సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ప్రజలు, రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. అధికారుల పనితీరు సరిగా లేకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, ఇది ఎంతమాత్రం కొనసాగడానికి వీల్లేదని హెచ్చరించారు. సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి తావులేదు: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న వ్యవహారాలు ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. వైఖరి మార్చుకోవాలని, లేదంటే పదవులు మారే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. భూ రీ-సర్వేలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లలో అనర్హులకు మంజూరు చేస్తే చర్యలు: ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాల్లో ఉండి, ఇల్లు మంజూరై నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. రెండవ జాబితా నుంచి అనర్హులకు ఎలాంటి మంజూరు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అనర్హులకు ఇల్లు మంజూరు అయితే సంబంధిత కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్, డీఎఫ్‌ఓలు అనూజ్ అగర్వాల్, సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్‌ కలెక్టర్ అజయ్ యాదవ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :