Thursday, 17 September 2026 12:43:10 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 27 July 2026 04:47 PM Views : 176

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పిస్తున్నాం. కొత్తగూడెం నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతాం.పార్టీలకతీతంగా పెదవర్గాలకు సంక్షేమ ఫలాలు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. రూ.1.95కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.కార్పొరేషన్ పరిధిలోని గ్రామాల రూపురేఖలు మార్చేలా సమగ్ర అభివృద్ధి పనులు చేపడుతున్నామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. సుజాతనగర్ మండల పరిధిలోని కార్పొరేషన్ డివిజన్‌లో రూ.1.95 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, బస్ షెల్టర్ల నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుజాతనగర్ కార్పొరేషన్ ప్రాంతంగా మారిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించామని చెప్పారు. ప్రతీ గ్రామంలో తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, సుజాతనగర్ నుండి శివాలయం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు అందుబాటులోకి తెచ్చామన్నారు. సుజాతనగర్‌లో మున్సిపల్ సబ్ డివిజన్ కార్యాలయ ఏర్పాటుతో పాటు, సింగభూపాలెం చెరువుకట్ట అభివృద్ధి కోసం రూ.5.5 కోట్లు మంజూరు కానున్నట్లు వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ (న్యాక్) కేంద్రం మంజూరైందని,అదేవిధంగానియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రగతికి అవసరమైన నిధుల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనులు వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సొసైటీ అధ్యక్షులు మండే హనుమంతరావు, టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, మున్సిపల్ కమిషనర్ సుజాత, కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ భారతి, ఏఓ నర్మద, విద్యుత్ శాఖ ఏఈ కిషన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్య దస్రు, మండల కార్యదర్శి కుమారి హనుమంతరావు, నాయకులు జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల రాములు తాళ్ల వెంకటేశ్వర్లు, తాళ్లూరి పాపారావు మండల నాయకులు వీర్ల మల్లేష్, దుర్గాప్రసాద్, బొడ్డు కేశవరావు, కొమారి కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :