తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 13 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం కాకర్ల ఎర్ర చెరువు మండలంలోని పెద్ద చెరువు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంది. ఎర్ర చెరువు 75 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. ఈరోజు కమిటీ సభ్యుల అధ్యక్షుడు చీమలపాటి బిక్షం ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సభ్యులు ఎవరైనా అకాల మరణం చెందినట్లయితే ఎర్ర చెరువు చాపల పెంపకం సొసైటీ ఆధ్వర్యంలో చనిపోయిన వారి కుటుంబానికి 40 వేల రూపాయలు అందజేసే విధంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇటీవల చనిపోయిన ముగ్గురు కమిటీ సభ్యులకు దుబ్బ తండ గ్రామానికి చెందిన బానోత్ రామచంద్రు, అదే గ్రామానికి చెందిన బానోత్ సేవ, కాకర్ల గ్రామానికి చెందిన ధోప్ప నాగేశ్వరరావు ల కుటుంబాలకు 40 వేల రూపాయలు చొప్పునల మూడు కుటుంబాలకు 120000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా చీమలపాటి భిక్షం మాట్లాడుతూ సొసైటీ 75 మంది సభ్యులతో ఉన్న మేమంతా వేరువేరు కులాలు వేరువేరు పార్టీలకు చెందిన వారిమైన ఒక తల్లి బిడ్డల వలె కలిసిమెలిసి ఉన్నామని మేమంతా ఒక కుటుంబం అని సభ్యులలోఎవరికైనా ఆపద వస్తే మా కుటుంబ సమస్యగా భావిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జల్లిక రాధాకృష్ణ, గూగుల్ వెంకటేశ్వర్లు, ఎముల నాగయ్య తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎర్ర చెరువు చేపల పెంపకం సొసైటీ కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ