తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్ లో డిసెంబర్ 14వ తారీకున (శనివారం) జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బత్తుల రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకోవచ్చని అన్నారు. 1.యాక్సిడెంట్ కేసులు 2.సివిల్ కేసులు 3.చీటింగ్ కేసులు 4.చిట్ పన్డ్ కేసులు 5.భూతగాదాలు కు సంబంధించిన కేసులు 6.వివాహ బంధానికి సంబంధించిన కేసులు 7.చిన్నచిన్న దొంగతనం కేసులు 8.ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 9. కుటుంబ తగాదాలు 10. బ్యాంకు కేసులు11. టెలిఫోన్ కేసులు 12. కొట్టుకున్న కేసులు 13. సైబర్ క్రైమ్ కేసులు ఈ లోకదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ