తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సింగరేణి విశ్రాంత ఏ.జీ.ఎం, ప్రకృతి ఆశ్రమం గౌరవ ఉపాధ్యక్షులు గోనె శ్రీకాంత్ _ దయా కుమారి దంపతులను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సభకు అతిథులుగా హాజరైన వక్తలు మాట్లాడుతూ... శ్రీకాంత్ శేష జీవితం సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు, రాజ్యాంగ పరిరక్షణకు, పర్యావరణ ప్రకృతి సంరక్షణలకు వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత గోనె శ్రీకాంత్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో సాధారణ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి, అంచలంచలుగా ఎదిగి, 36 సంవత్సరాలు సంస్థలో పనిచేసే, ఏజీఎంగా కొత్తగూడెంలో రిటైర్మెంట్ పొందడం గర్వకారణంగా ఉందన్నారు. తన శేష జీవితాన్ని కుటుంబ సభ్యుల అభ్యున్నతితో పాటు, సామాజిక సమస్యలు పరిష్కారం కోసం కొంత సమయాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఘనంగా సన్మానించిన ప్రకృతి ఆశ్రమం సభ్యులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆశ్రమం కో ఆర్డినేటర్ సుగుణారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అతిథులుగా ఆశ్రమం గౌరవ అధ్యక్షులు, విశ్రాంత ప్రిన్సిపాల్, డా. బత్తుల కృష్ణయ్య, గౌరవ సలహాదారులు పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య, సింగరేణి విశ్రాంత జిఎం, బహుజన ఐక్యవేదిక కన్వీనర్ శనగ వెంకటేశ్వర్లు హాజరు కాగా, డా. జి. కనకరాజు, బుద్ధిస్ట్ కొచ్చర్ల కమలా రాణి, కే హెచ్ ప్రసాద్, అంబేద్కర్ రైటిస్ తుంపురు శివ, మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, ప్రముఖ సింగర్ మేదర వెంకట ముత్యం, దయాసాగర్, జెట్టి మోహన్, తమ సందేశాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ దంపతులకు మొక్కల ప్రేమికులు చిన్నారులు నైనిక రజ్వా, మహమ్మద్ అఫాన్ లు మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. టి. రాయలింగు, రగన్ బాబు, శనగ ప్రభాకర్, శనగ స్వామి, గండూరీ సంజీవరావు, జరీనా బేగం, శోభారాణి, క్రాంతిలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ