Monday, 03 August 2026 09:10:52 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జిల్లా కలెక్టరేట్లో ఘనంగా మహిళ అంతర్జాతీయ దినోత్సవం. ప్రతిభ కనబరిచిన మహిళలకు ఘన సత్కారం.

Date : 07 March 2026 08:11 PM Views : 481

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆదర్శంగా నిలవాలి జిల్లా కలెక్టర్ అంకిత్. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా, తమలోని ప్రతిభను వెలికితీసి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం నందుగల మీటింగ్ హాల్లో జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనినా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదని, అది సామాజిక అవసరమని పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా విద్యా, వైద్య, రాజకీయ, సాంకేతిక రంగాల్లో రాణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూ ఆర్థిక స్వాలంబన సాధించాలని ఆకాంక్షించారు.నేటి ఆధునిక కాలంలో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతూ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహిళలు స్వయం ఉపాధి, విద్య, వైద్యం మరియు రాజకీయ రంగాల్లో చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరియు సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ అధికారిని గారిని మాట్లాడుతూస్వర్ణలత లెనినా గారు మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణ, శిశు సంక్షేమం మరియు అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శకత్వంలో మహిళా సాధికారత కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్న మహిళా కార్పొరేటర్లను, నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులను, వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను మెమెంటో, శాలువా, సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొట్టడం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు శ్రీలత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, జిల్లాస్థాయి మహిళా అధికారులు, జిల్లాలోని అంగనవాడి సిడిపివోలు , సూపర్వైజర్లు, టీచర్లు,డిసిపియు, సిడబ్ల్యసి, సిహెచ్ఎల్, మిషన్ శక్తి, డిఎచ్డ్యు, పోషణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :