తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం తీవ్ర లోటులో ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 03/11/2026 నాటికి విడుదల చేసిన మండలాల వారీగా సంచిత వర్షపాతం నివేదిక ప్రకారం జిల్లా సగటున -30% లోటు నమోదైంది.జిల్లాలో మొత్తం 23 మండలాలకు గాను 21 మండలాలు Deficient (లోటు) జాబితాలో ఉండగా, కేవలం 2 మండలాలు మాత్రమే Normal (సాధారణ) స్థితిలో ఉన్నాయి. Large Excess, Excess, Large Deficient కేటగిరీలో ఒక్క మండలం కూడా లేదు.సాధారణ వర్షపాతం నమోదైన మండలాలు:జూలూరుపాడు (-16%) చంద్రుగొండ (+7%) అత్యధిక లోటు ఉన్న మండలాలు:పినపాక (-40%), మణుగూరు (-48%), భద్రాచలం (-48%), దమ్మపేట (-48%), బూర్గంపాడు (-37%), లక్ష్మీదేవిపల్లి (-35%) జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మండలంలో కూడా 709.8 మి.మీ వర్షపాతానికి గాను సాధారణం 1039.2 మి.మీ ఉండాల్సి ఉండగా -32% లోటు నమోదైంది.నేటి వర్షపాతం కూడా ఆందోళనకరంగా ఉంది. జిల్లా సగటున నేడు 6.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 2.5 మి.మీ మాత్రమే కురిసింది అంటే -63% లోటు.ఈ వర్షాభావం వల్ల రబీ సీజన్ పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ