Friday, 18 September 2026 08:05:50 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్.

Date : 25 July 2026 08:52 PM Views : 158

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జెన్కో రూ.54 వేల కోట్ల మొండి బకాయిపై సమీక్ష సమావేశంలో నోరు మెదపని ఉప ముఖ్యమంత్రి.54 వేల కోట్ల మొండి బకాయిని కనీసం వాయిదాల పద్ధతిలోనైనా చెల్లించండి.అవంతిక, డిప్‌సైడ్, కోయగూడెం, జేకే-5 ఎక్స్‌టెన్షన్ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలి.ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 23, 24 తేదీల్లో సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు సింగరేణి ఏరియాల్లో పర్యటించడం స్వాగతించదగ్గ విషయమని, అయితే సింగరేణికి తెలంగాణ జెన్కో నుంచి రావాల్సిన రూ.54 వేల కోట్ల మొండి బకాయిల అంశాన్ని సమీక్ష సమావేశంలో ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు.శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెంలో జెన్కో, సింగరేణి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సింగరేణి ఆర్థిక పరిస్థితికి అత్యంత కీలకమైన బకాయిల అంశంపై చర్చ జరగాల్సి ఉండేదని పేర్కొన్నారు.జెన్కో బకాయిలను కనీసం విడతల వారీగా అయినా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని, సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా సత్తుపల్లి అవంతిక ప్రాజెక్టు, మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్, కోయగూడెం,ఇల్లందు జేకే-5 ఎక్స్‌టెన్షన్ వంటి బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.దీంతో సంస్థకు భవిష్యత్తులో ఉత్పత్తి పెరిగి, వేలాది మంది కార్మికుల ఉపాధి భద్రపడుతుందని అన్నారు.రామ్ పురం మైన్ గ్యాసిఫికేషన్‌కు అత్యంత అనుకూలమైన గనిని తక్షణమే ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇది సింగరేణి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఇన్వాలిడేషన్ చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుతం హార్ట్ ఆపరేషన్లు చేయించుకున్న వారు, పక్షవాతం (పారాలిసిస్)తో పాటు వివిధ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి ఇన్వాలిడేషన్ మంజూరు చేయడం ద్వారా కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం,సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ప్రకటన కోసం కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని, ఆ ప్రకటనను వెంటనే విడుదల చేసి కార్మికులకు లాభాల వాటాను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :