తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు అందుకున్న అజ్మీర సురేష్ నాయక్‌కు ఘన సన్మానం NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు అందుకున్న అజ్మీర సురేష్ నాయక్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు తన స్వగృహంలో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న అజ్మీర సురేష్ నాయక్‌కు వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు లభించడం అభినందనీయమని అన్నారు. నూతన బాధ్యతల్లో ఆయన మరింత విజయవంతంగా రాణించాలని, విద్యార్థి సమస్యలపై మరింత చురుగ్గా పనిచేస్తూ NSUIకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అజ్మీర సురేష్ నాయక్ గతంలో నిర్వహించిన బాధ్యతలను గుర్తుచేస్తూ, విద్యార్థులు మరియు యువత సమస్యలపై ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని నాగా సీతారాములు పేర్కొన్నారు. మరోసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని, ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అందించిన పార్టీ పెద్దలకు, NSUI రాష్ట్ర నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ఈ బాధ్యతను ఒక పదవిగా కాకుండా విద్యార్థుల పట్ల తనకున్న బాధ్యతగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి విద్యార్థికి అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా రంగ అభివృద్ధి, యువతకు మెరుగైన అవకాశాల కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం చూపిన మార్గంలో నడుస్తూ NSUIని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరింత బలోపేతం చేయడంతో పాటు, విద్యార్థులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అజ్మీర సురేష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా తనను ఆత్మీయంగా సన్మానించి, నూతన బాధ్యతలపై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు అజ్మీర సురేష్ నాయక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అజ్మీర సురేష్ నాయక్ కూడా నాగా సీతారాములుని,మండే.వీర్ హనుమంతరావుని శాలువాతో సన్మానించి, ఆత్మీయంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతు రావు, మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ అబీద్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మండే రవీందర్,యువజన కాంగ్రెస్ నాయకులు గుగులోతు కోటేష్,చేజావత్ సాయి,NSUI నాయకులు బానోత్ శ్రీధర్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ