తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా చూసుకోవాలని సూచించారు. వైద్య, మున్సిపల్, పంచాయితి, ఫైర్, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. సమస్య ఏర్పడిన వెంటనే స్పందించాలని, అవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ