Saturday, 19 September 2026 11:00:07 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

చర్ల మరియు సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదవుతున్న జ్వర కేసులు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO).

Date : 02 February 2026 08:31 PM Views : 181

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చర్ల మరియు సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదవుతున్న జ్వర కేసుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) సంబంధిత సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జ్వర కేసుల నియంత్రణపై పలు కీలక సూచనలు జారీ చేశారు. నమోదైన ప్రతి జ్వర కేసును ప్రతిరోజూ సర్వే చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐఆర్‌ఎస్ స్ప్రేయింగ్ మరియు మలాథియన్ టెక్నికల్ ఫాగింగ్‌ను నాలుగు వారాల పాటు నిర్దిష్ట వ్యవధుల్లో నిర్వహించాలని సూచించారు. రోజువారీ జ్వర సర్వేలను సమగ్రంగా పర్యవేక్షించే బాధ్యత సూపర్వైజింగ్ అధికారికి (SUO) ఉంటుందని, స్ప్రేయింగ్ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలని తెలిపారు. ప్రతి గ్రామం మరియు ఇంటింటికీ చేరుకునేలా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.ఏ గ్రామంలోనైనా ఒక్క జ్వర కేసు గుర్తించినా, ఆ గ్రామంలో మరిన్ని కేసులు రాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం “డ్రై డే” కార్యక్రమాలను ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా నిర్వహించి, సర్వే ఫారమ్‌ను పూర్తి చేయాలని సూచించారు.ఈ సర్వే ఫారమ్‌లో ఎన్‌సీడీ, ఈసీ, టీసీ, ఏఎన్‌సీ, పీఎన్‌సీ, ఎస్‌ఏఎం, ఎమ్‌ఏఎం, బాలల టీకాలు, విటమిన్–ఏ పంపిణీ, కుటుంబ నియంత్రణ ప్రోత్సాహం తదితర ఆరోగ్య కార్యక్రమాల వివరాలు నమోదు చేయాలని తెలిపారు.అనంతరం డీఎంహెచ్‌ఓ CHC చర్లను సందర్శించి వార్డులు, ఆపరేషన్ థియేటర్ మరియు ప్రసూతి వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు సేకరించారు.జ్వర కేసులపై సమీక్ష నిర్వహించి, అందిస్తున్న చికిత్స విధానాలపై CHC వైద్యులతో చర్చించారు. మలేరియా మందుల లభ్యతను పరిశీలించగా తగినంత నిల్వ అవసరమని గుర్తించారు.విషప్రయోగం మరియు పాము కాటు కేసుల నిర్వహణపై విచారించి, సంబంధిత అత్యవసర మందుల లభ్యతను వైద్యులతో నిర్ధారించుకున్నారు. తగినంత మలేరియా మందుల నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని మరియు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మలేరియా అదనపు డైరెక్టర్ గారికి లేఖ రాయాలని పోగ్రాం ఆఫీసర్ (మలేరియా)కు ఆదేశించారు.అలాగే డీఎంహెచ్‌ఓ, పిహెచ్‌సీ జూలూరుపాడు మరియు సుజాతనగర్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పర్శ్ లెప్రసీ అవగాహన కార్యక్రమాల భాగంగా సుజాతనగర్ పాఠశాలలో విద్యార్థులకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించి, అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. శ్రీధర్, పోగ్రాం ఆఫీసర్ (మలేరియా) డా. స్పందన , పిహెచ్‌సీ వైద్యాధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :