Saturday, 19 September 2026 04:44:44 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక - ఉచిత వైద్య శిబిరాలు ప్రారంభం

Date : 07 March 2026 03:42 PM Views : 567

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ పీహెచ్‌సీలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు : జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్ వైద్యులు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరాలను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు ఈ వైద్య శిబిరాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ఎక్కువ మంది ప్రజలు శిబిరాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా రక్తపరీక్షలు, కీళ్ల సమస్యలకు సంబంధించిన పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు వంటి ఆరోగ్య పరీక్షలను ప్రజలు చేయించుకొని తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే రోగులను కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసి అక్కడ అందుబాటులో ఉన్న అన్ని ప్రధాన పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్కానింగ్, ఎక్స్-రే వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నందున అవసరమైన వారికి అక్కడ పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ఉచిత వైద్య శిబిరాలను దశల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సుజాతనగర్, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రతిరోజు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చొప్పున ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరాలలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, గైనకాలజీ, డెంటల్, ఆఫ్తమాలజీ వంటి ఆరు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శిబిరాలకు వచ్చే రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేయడంతో పాటు అవసరమైతే మెరుగైన చికిత్స కోసం పై స్థాయి ఆసుపత్రులకు రిఫర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఉచిత వైద్య శిబిరాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఎక్కువ మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, తాసిల్దార్ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ రమేష్, ఎంపీడీవో భారతి సంబంధిత శాఖల అధికారులు వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :