Friday, 18 September 2026 06:13:01 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

గ్రూప్-3 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 16 November 2024 05:17 PM Views : 864

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 17 మరియు 18 తారీఖులలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో జరుగునున్న గ్రూప్-3 కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు తెలియజేశారు. కొత్తగూడెంలోని 26 పరీక్ష కేంద్రాలు,పాల్వంచలోని 13 పరీక్షా కేంద్రాలు మొత్తం 39 కేంద్రాల వద్ద సుమారుగా 350 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఈ నెల 17వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 గంటలకు పరీక్ష జరగనుంది.మరలా సోమవారం 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు పరీక్షా సమయాన్ని నిర్ణయించారు.జిల్లా వ్యాప్తంగా 13,478 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.

పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులు ఉదయం 9.30 గంటలు లోపు, మధ్యాహ్నం అయితే 14.30 గంటల లోపు హాజరుకావాలి. తెలుపబడిన సమయాలకు పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్లను మూసివేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకుని రాకూడదు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. మంటను ప్రేరేపించే వస్తువులను గాని,ఇంకు బాటిల్స్ మరియు అనుమతి లేని యే ఇతర వస్తువులను తమ వెంట తీసుకురాకూడదు. మాల్ ప్రాక్టీస్ నకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్-3 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి అపోహలకు,ఆందోళనకు గురికాకుండా పరీక్షకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రూప్ -3 పరీక్షా కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యే అధికారులు మరియు సిబ్బందికి కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ మరియు ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ లు సమావేశం ఏర్పాటు చేసి బ్రీఫింగ్ చేయడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :