Saturday, 19 September 2026 09:55:04 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష, తాగునీరు, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

Date : 08 April 2026 06:12 PM Views : 221

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష – ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘు రామ్ రెడ్డి. తాగునీరు, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి – మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దిశా సర్వసభ్య సమావేశం బుధవారం జిల్లా కేంద్ర ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి అధ్యక్షత వహించారు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కో-చైర్మన్‌గా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, దిశా కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. సమావేశంలో గత దిశా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతి సమగ్రంగా సమీక్షించబడింది. ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి జిల్లా అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని, ప్రతి శాఖ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పనుల పురోగతిని నివేదికల రూపంలో ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి, గత నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టంగా సూచించారు. ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం లో భాగంగా గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తుందని, ఇప్పుడు కేవలం 60 శాతం మాత్రమే ఇచ్చే విధంగా మార్పు వచ్చి, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలో అనేక మార్పులు రావడం వలన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చర్చ జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమని, ప్రతి పథకం లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులకు సమయానికి ప్రయోజనాలు చేరేలా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మణుగూరు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం తదితర ప్రాంతాల ప్రభుత్వ ఆసుపత్రుల పరిశుభ్రత, ఆహార నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, అంబులెన్స్, డయాలసిస్ సేవల విస్తరణ, సికిల్ సెల్ అనీమియా, హెచ్పీవీ వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమాలపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి అని సూచించారు. మిషన్ భగీరథ, అమృత్ పథకాల కింద తాగునీటి సరఫరా మరియు పైప్‌లైన్‌లీకేజీలను తొలగించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీలలో త్రాగునీటి సరఫరా పనులను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, ఆర్ & బి, విద్యుత్ శాఖల పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఐటీడీఎ నిధులతో చేపట్టిన పనులలో ఆలస్యానికి కారణాలను వివరించాలని అధికారులు నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ , కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుమూల ప్రాంతాల వరకు త్రాగునీటి సరఫరా కల్పించాలని, ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయడం కోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దిశా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి అమలును వేగవంతం చేయాలని, ప్రతి శాఖ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో చేరేలా పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని, పనుల నాణ్యతపై ఎటువంటి రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శాసన సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై అధికారులు సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తదితరులు తమ నియోజకవర్గాల్లో పథకాల అమలు స్థితిగతులపై అధికారుల నుంచి సవివర నివేదికలు కోరారు. ఈ సమావేశంలో ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, అశ్వరావుపేట మున్సిపల్ చైర్ పర్సన్ శశికళ, డి ఆర్ డి ఓ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, దిశా కమిటీ సభ్యులు బుర్ర సురేష్, యేసుమని, స్వర్ణ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :