Friday, 18 September 2026 09:02:20 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 10.56 శాతం పోలింగ్ నమోదు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 11 February 2026 10:52 AM Views : 465

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపాలిటీల మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న 2వ సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 106 వార్డుల్లో పోలింగ్ జరుగుతుండగా, 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు 19,584 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని 10.56 శాతం పోలింగ్ నమోదైంది.పట్టణాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి: అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు, 35 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 16,850 మంది ఓటర్లలో 3,520 మంది ఓటు హక్కు వినియోగించుకుని 20.89 శాతం పోలింగ్ నమోదైంది.కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు, 201 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 1,34,775 మంది ఓటర్లలో 13,341 మంది ఓటు వేసి 9.89 శాతం పోలింగ్ నమోదైంది.ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు, 52 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 33,723 మంది ఓటర్లలో 2,723 మంది ఓటు హక్కు వినియోగించుకుని 8.07 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :