Saturday, 19 September 2026 07:55:13 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్‌పై జిల్లాస్థాయి శిక్షణ.

Date : 21 February 2026 07:12 PM Views : 473

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో మీసేవ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు సమయపాలనతో సేవలు అందించడమే లక్ష్యంగా ఐడీఓసి కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని నయాబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీవోలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ మాట్లాడుతూ, మీసేవ కేంద్రాల్లో స్వీకరించే దరఖాస్తులను వేగవంతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీసేవ ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగం అత్యంత కీలకమని తెలిపారు. యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోనే ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి తక్షణమే పోర్టల్‌కు అప్‌డేట్ చేయవచ్చని వివరించారు.క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అధికారులు దరఖాస్తుదారుల నివాసానికి వెళ్లి సంబంధిత వివరాలను యాప్‌లో నమోదు చేయడం, జియో-ట్యాగ్‌తో కూడిన లైవ్ ఫోటోలను అప్‌లోడ్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులకు అవకాశం లేకుండా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. భౌతిక ఫైళ్ల కదలిక అవసరం లేకుండా పూర్తిగా డిజిటల్ విధానంలోనే పరిశీలన పూర్తయ్యే విధంగా వ్యవస్థ ఉండటంతో, ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల దరఖాస్తులు త్వరితగతిన ఆమోదం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు . యాప్ ద్వారా సేకరించిన సమాచారం నేరుగా మీసేవ పోర్టల్‌కు అనుసంధానమై డేటా తక్షణమే అప్‌డేట్ అవుతుందని తెలిపారు.ఈ శిక్షణ తరగతులకు జిల్లాలోని సుమారు 160 మంది జీపీవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 40 మంది నయాబ్ తహసీల్దార్లు మరియు 15 మంది ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. యాప్ డౌన్‌లోడ్ విధానం, లాగిన్ ప్రక్రియ, ఫీల్డ్ వెరిఫికేషన్ నమోదు, ఫోటో అప్‌లోడ్, రిపోర్ట్ సమర్పణ తదితర అంశాలపై ప్రదర్శనతో కూడిన సమగ్ర అవగాహన కల్పించారు. అధికారుల సందేహాలకు వివరణాత్మక సమాధానాలు అందించి, యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.జిల్లాలో మీసేవ సేవలను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలను వేగవంతంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :