తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 12 (తెలుగు వెలుగు) : కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మైనింగ్ ను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం 300 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు మంజూరు చేయడంలొ పట్టు వదలని విక్రమార్కుడిలాగా విశేష కృషి చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనoనేని సాంబశివరావు చిత్రపటానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మైనింగ్ విద్యార్థులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడం హర్షనీయమనారు, రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లు ఎర్త్ సైన్సెస్ కోర్సు చదవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేదని కొత్తగూడెం లోనే ఈ కోర్సులు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల ఇబ్బందులు తీరనున్నాయన్నారు, ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడంతో అత్యున్నత ప్రమాణాలతో వేలాది మంది విద్య ఉపాధి అవకాశాలు లభించనున్నాయననీ, వేల సంఖ్యలో యువ శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అడ్మిషన్లతో జిల్లాకు జాతీయస్థాయిలో పేరు రాబోతుందని విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తుతోపాటు కొత్తగూడెం ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలని కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్ లొ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేపించారని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆయన అన్నారు, ఇదేవిధంగా ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం మంజూరు చేయుటకు కృషిచేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు... ఈ కార్యక్రమంలో వినయ్, సంజయ్, పవన్ సింగ్, రణధీర్, శివ తదితరులు పాల్గొన్నారు...
Admin
తెలుగు వెలుగు టీవీ