తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి శనివారం తెలంగాణలోని అన్ని ఇఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమం పురోగతి, అలాగే పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు.ఓటర్ జాబితా నవీకరణ, క్లెయిమ్‌లు–అభ్యంతరాల పరిష్కారం, ఫీల్డ్ ధృవీకరణ, డేటా ఎంట్రీ ఖచ్చితత్వం వంటి ముఖ్య అంశాలపై సీఈఓ అధికారులు నివేదికలు సమర్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కట్టుబడి అమలు చేయాలని, ప్రతి దశలోనూ ఖచ్చితత్వం, జాగ్రత్త, సమయపాలన పాటించాల్సిందే అని ఆయన సూచించారు.SIRకు సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి, ఓటర్ జాబితా నాణ్యతను మరింత మెరుగుపర్చే దిశగా శ్రద్ధగా పనిచేయాలని సీఈఓ ఆదేశించారు. ఖచ్చితమైన, లోపరహిత ఓటర్ జాబితా ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫిరెన్స్ కు ఐ డి ఓ సి కార్యాలయం సమావేశమందిరం నుండి అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ఎలక్షన్ ట్రయినర్ సాయి కృష్ణ, ఎన్నికల సిబ్బంది అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ