తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెంను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం జిల్లా ఎస్ పి రోహిత్ రాజు తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు,యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాలు వినియోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉండేలా కళాశాల యజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. విద్యాసంస్థల్లో నిర్వహించే పేరెంట్స్ టీచర్ సమావేశాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం వల్లే కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలని అన్నారు.గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై యదార్థ సంఘటన ఆధారంగా వారి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపడుతుందో వీడియోల ద్వారా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు అలవాటు ఉన్న వారిని గుర్తించి వారిని పునరావాస కేంద్రాలు ద్వారా అలవాటు మానిపించాలన్నారు. చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు మాదకద్రవ్యాలను అలవాటు పడిన పడినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టుల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో గంజాయి తో పాటు గుడుంబా నివారణకు సైతం అవసరమైన చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు. అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములను పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచించారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచన విధానం, ఆలోచన శక్తి నశిస్తాయన్నారు. భావితరాలు మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నార మాదకద్రవ్యాలు వినియోగించిన, రవాణా చేసిన పిడి యాక్టర్ నమోదు చేస్తాం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. మాదకద్రవ్యాలు వినియోగించిన లేదా రవాణా చేసిన పీడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 3,500 కేజీల గంజాయిని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. జిల్లాకు ఒరిస్సా నుండి వయా సీలేరు ద్వారా అటవీ ప్రాంతం నుండి గంజాయి రవాణా నియంత్రించేందుకు భద్రాచలం చెక్ పోస్ట్ ద్వారా 24 గంటల పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి గంజాయి రవాణా ను అడ్డుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మాదకద్రవ్యాలు గుర్తించేందుకు రెండు నాక్కోటిక్ డాగ్ లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. దానికి గాను రాష్ట్రస్థాయిలో అవార్డు కూడా అందుకున్నామన్నారు. ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. మాదకద్రవ్య ల వినియోగం పట్ల విద్యార్థులకు మరియు యువకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వాటి వినియోగం వల్ల పడే శిక్షల గురించి తెలపాలని అధికారులకు సూచించారు. పాఠశాల లో పొక్సో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాలు వినియోగాన్ని అడ్డుకునేందుకు డ్రగ్ టెస్టింగ్ కిట్లను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. భద్రాచలంలో డి ఎడిక్షన్ సెంటర్ ను కూడా అందుబాటులో తీసుకువచ్చినట్లు ఎస్పీ తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో భద్రాచలం ఏ.ఎస్.పి విక్రాంత్ సింగ్, ఎక్సైజ్ సూపర్ టెంట్ జానయ్య, ఇల్లందు డి ఎస్పీ రమణమూర్తి, కొత్తగూడెం ఆర్ టి ఓ వెంకటరమణ, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ