తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO)గా శ్రీమతి డి. వాసంతి మంగళవారం (02-06-2026) బాధ్యతలు స్వీకరించారు.నూతనంగా విధులలో చేరిన జిల్లా విద్యా శాఖాధికారిణి వాసంతి గారిని జిల్లా విద్యాశాఖా కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీ శంభు ప్రసాద్ మరియు కార్యాలయ సిబ్బంది పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా జిల్లా కలెక్టర్ కి మొక్కను అందజేశారు. జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ఫలితాల పెంపు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు ప్రత్యేక కృషి చేస్తానని డి. వాసంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ