Tuesday, 03 November 2026 09:17:51 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

కొండరెడ్ల గిరిజనుల కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడానికి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడానికి సంబంధిత ఎంపీడీవోలు ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలి

Date : 23 May 2025 07:39 PM Views : 603

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐటీడీఏ పరిధిలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజనుల కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడానికి పీఎం జన్మన్ పథకం కింద ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడానికి సంబంధిత ఎంపీడీవోలు ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో దమ్మపేట అశ్వరావుపేట మండలాలలోని ఎంపీడీవోలు మరియు కొండరెడ్ల గ్రామాలకు సంబంధించిన పంచాయతీ సెక్రెటరీలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు ఇస్తూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ కొండ కోనల్లో నివసించే కొండ రెడ్ల గిరిజన కుటుంబాలకు పీఎం జన్మన్ పథకం ద్వారా నివాస గృహాలు నిర్మాణం చేపట్టడానికి ప్రతిపాదనలు కోరినందున సంబంధిత ఎంపీడీవోలు మరియు పంచాయతీ సెక్రటరీలు అశ్వరావుపేట మండలంలో ఏడు కొండ రెడ్ల గిరిజన గ్రామాల హేబిటేషన్లు మరియు దమ్మపేట మండలంలో పూసుకుంట గ్రామంలోని కొండరెడ్ల గిరిజన కుటుంబాలను ఇంటింటికి తిరిగి మొబైల్ యాప్ ద్వారా సర్వే చేసి వాటికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని, కొండ రెడ్ల గిరిజన కుటుంబాలలోని అర్హులైన ప్రతి ఒక్కరిని మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ చేసి అందరికీ పిఎం జన్మన్ పథకం ద్వారా నివాస గృహాలు అందే విధంగా సంబంధిత ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని, శనివారం నుండి మొబైల్ యాప్ ద్వారా సర్వే కార్యక్రమం ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, అశ్వరావుపేట మరియు దమ్మపేట ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :