తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గోవిందరావు అధ్యక్షతన BLAలు మరియు సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాలేరు నియోజకవర్గ SIR సమన్వయకర్త నాగాసీతారాములు తో కలిసి ఖమ్మం పార్లమెంట్ SIR సమన్వయకర్త గోపిశెట్టి రాఘవేందర్ , ERO రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ, SIR - Special Intensive Revision కార్యక్రమం విజయవంతం కావడానికి BLAల బాధ్యతలు, ఓటరు జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ మరియు సమన్వయం* పై పలు కీలక సూచనలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో స్వచ్ఛమైన ఓటరు జాబితా కీలకమని, ప్రతి BLA క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేయాలని కోరారు సిఎం రేవంత్ రెడ్డి , ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క ,రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో SIR ప్రోగ్రాం ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఏ సూపర్ వైజర్లు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ