తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 02(తెలుగు వెలుగు) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లీ మండలం హేమచంద్రపురం గ్రామంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది లేరా ఉన్న మా కొత్త కాలనీ పరిస్థితి పట్టించుకోరా అని వాపోతున్నారు.కాల్వలు నిండి సుమారు గా మూడునెలలు అవుతున్న కూడా కనీసం పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని అంటున్నారు. కనీసం అధికారులు సైతం ఇటువైపు గా చూడట్లేదు అని అన్నారు. ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన సంబంధం లేదు అన్నట్టు గా వ్యవహరిస్తున్నారు. కాల్వలు నిండి చెత్త పేరుకొని చుట్టుపక్కన ప్రజలు డెంగ్యూ, మలేరియా, జ్వరాల బారిన పడుతున్న కూడా కనీసం పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ