Friday, 18 September 2026 01:16:44 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

రెండో రోజు ముమ్మరంగా రోడ్డు, డ్రైన్ నిర్మాణం పనులు. నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్ గణేష్.

Date : 13 July 2026 08:11 PM Views : 189

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండో రోజు ముమ్మరంగా రోడ్డు, డ్రైన్ నిర్మాణం పనులు.నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్ గణేష్. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధిపై ప్రేత్యేక ద్రుష్టి సారించాం.కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులు పాల్వంచ పట్టణంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయని, నాణ్యతా ప్రమాణాలతో వీటిని పూర్తి చేయడమే లక్ష్యమని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కృషితో మంజూరైన రూ.38 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో తహసిల్దార్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జరుగుతున్న రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. పట్టణ ప్రగతిపై ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి, నిధుల సాధనలో చూపిస్తున్న చొరవ వల్లనే నేడు అనేక అభివృద్ధి పనులు సాకారమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న ప్రజాప్రతినిధుల సహకారంతో పట్టణ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయని వివరించారు. ఈ పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ పట్టణాలను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మేయర్ ధీమా వ్యక్తం చేశారు. మేయర్ వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్, కాకటి రవీందర్, మున్సిపల్ అధికారులు తదితరులు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :