తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలి. కేసును నీరుగారిస్తే రాజధాని ముట్టడిస్తాం.ప్రభుత్వ కంటితుడుపు చర్యలు సరికాదు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై చర్యలేవి. కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా.నర్సు ఊకె శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే రాజధానిని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా హెచ్చరించారు. ఊకె శిరీష హత్య ఘటనపై సోమవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం 'శేషగిరిభవన్'లో రాజకీయ, సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్న గిరిజన యువతిపై ఇంతటి ఘాతుకానికి పాల్పడటం సభ్యసమాజం తలదించుకోవాల్సిన విషయమన్నారు. ఈ దారుణంపై రాష్ట్ర ప్రభుత్వం కేవలం కంటి తుడుపు చర్యలతో సరిపెట్టడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరపాలి.మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. గిరిజన బిడ్డ శిరీష హత్య సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా చూడాలన్నారు.రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే బ్రహ్మచారి.సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే బ్రహ్మచారి మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించేలా సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం. కాంగ్రెస్ జిల్లా నాయకులు మంద హనుమంతు కాంగ్రెస్ జిల్లా నాయకులు మంద హనుమంతు మాట్లాడుతూ.. శిరీష కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యంగా అండగా ఉంటాయన్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి బాధిత కుటుంబంలో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.మహిళల భద్రతపై కఠినంగా వ్యవహరించాలి. టిఆర్ఎస్ జిల్లా నాయకులు వీరన్న,టిఆర్ఎస్ జిల్లా నాయకులు వీరన్న మాట్లాడుతూ.. అమాయక గిరిజన యువతిని పొట్టనబెట్టుకున్న నిందితులపై అధికారులు ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళా రక్షణ చట్టాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు.అసెంబ్లీలో సమస్యను ప్రస్తావిస్తా.బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాంసిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హైదరాబాద్ నుంచి ఫోన్ ద్వారా మాట్లాడారు. నర్సు శిరీష హత్య తీవ్ర దిగ్భ్రాంతికరమని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం దక్కేలా బాధ్యత తీసుకుంటానని తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, బాధితులకు పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. న్యూ డెమోక్రసీ నాయకులు గౌని నాగేశ్వరరావు, ఉక్లా, సామాజిక ప్రజాసంఘాల నాయకులు సలిగంటి శ్రీనివాస్, మున్నా లక్ష్మికుమారి, ఎస్ కే ఫహీం, చండ్ర అరుణ, ఏం జ్యోతి, వాసం రామకృష్ణ, మద్దెల శివకుమార్, వర్క అజిత్, హరికృష్ణ, రాంబాబు, రమేష్, అసిఫ్ ఉద్దీన్, రత్నకుమారి, మేదిని లక్ష్మి, బిక్షం, నాగకృష్ణ, తదితరులు మాట్లాడారు. సలిగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజకీయపక్షాలు, సంఘాల నాయకులు ఖయ్యూం, లక్ష్మీ, షాహిన్, కైసర్, విష్ణు, సాయి కుమార్, యాకుబ్ షావలి, జాటోత్ కృష్ణ, కల్లూరి కిషోర్, రవి ముసలం రామకృష్ణ, గోవిందు, అంకుష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ