తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం () సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా శుక్రవారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు - మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, తూము చౌదరి, కోనేరు చిన్ని తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కాకుల్లా అరుస్తున్నారని ఘాటుగా విమర్శించారు. గత పదేళ్ల తుగ్లక్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పదేళ్లపాటు అటు రాష్ట్రాన్ని ఇటు నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశారని విమర్శించారు. గత పదేళ్లలో కేసీఆర్ పాలనకు ఎదురొడ్డి పోరాడి ప్రజల చేత శభాష్ అనిపించుకుని ప్రజా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు, పెదబాబు, భాగం మోహన్ రావు, కౌన్సిలర్ లు వై శ్రీనివాస్ రెడ్డి, తలుగు అనిల్, మాజీ ఏఎంసి చైర్మన్ భూక్య రాంబాబు, సుందర్ లాల్ కోరి, బాల పాసి, మహిళా నాయకులు వాణిరెడ్డి, హైమావతి, పద్మ, శాంతి, ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయ ప్రకాష్, బొబ్బల వెంకట్, గుగులోత్ కిషన్, భూపతి అశోక్, మైనారిటీ నాయకులు మహమ్మద్ గౌస్, రియాజ్, అయూబ్ ఖాన్, గోబ్ర్యా నాయక్, సత్యనారాయణ రెడ్డి, సంపత్, యువజన కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, మతిన్, వెంకట్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ