Thursday, 17 September 2026 06:25:19 PM
# అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ.

కుంజా వనజ మృతిపై Dr రవీందర్ నాయక్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆరా

Date : 20 June 2026 04:57 PM Views : 114

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రోగ్రాం అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న కుంజ వనజ మృతి ఘటనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డా. రవీందర్ నాయక్ జిల్లాకు విచ్చేసి కుంజా వనజ మృతి సంఘటనపై సమగ్రంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్, మరియు Dr రవిబాబు DCHS, సంబంధిత వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బందితో సమావేశమై గర్భిణికి అందించిన వైద్య సేవలు, చికిత్స వివరాలు, రిఫరల్ ప్రక్రియ, సంఘటనకు దారితీసిన పరిస్థితులు తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి, విధుల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరిగాయో సమగ్రంగా విచారణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విచారణ నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. తదుపరి డైరెక్టర్ డా. రవీందర్ నాయక్ జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, మాతా-శిశు ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, అసంక్రమిత వ్యాధుల (NCD) స్క్రీనింగ్, టీకా కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల పనితీరు, సికిల్ సెల్ అనీమియా నియంత్రణ కార్యక్రమం, క్షయవ్యాధి నిర్మూలన, కుష్ఠు నిర్మూలన, వెక్టర్ బోర్న్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై కార్యక్రమాల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను శాతానికి శాతం సాధించాలని, పెండింగ్ అంశాలను వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్య సంస్థల్లో గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. మాతా-శిశు మరణాల నివారణకు ప్రతి ఆరోగ్య కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని డైరెక్టర్ డా. రవీందర్ నాయక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో Dr తుకారాం రాథోడ్ DMHO, Dr రవిబాబు DCHS, Dr ప్రతాప్ ప్రోగ్రాం ఆఫీసర్ Dr ప్రసాద్ ప్రోగ్రాం ఆఫీసర్, Dr దినేష్ ప్రోగ్రాం ఆఫీసర్, మోహన్, రామ్ ప్రసాద్ , విప్లవ్ కుమార్, సలిత, శ్రీధర్ , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :