తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం లో మండలవ్యాప్తంగా సిపిఐ పార్టీ సభ్యత్వాన్ని జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు అనునిత్యం అండదండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని నిత్యం పేద ప్రజల సమస్యల కోసం పాలకులపై ప్రజా పోరాటాల నిర్వహిస్తూ ఎర్రజెండా పేదల పక్షాన ఉంటుందని సిపిఐ వంద సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోసిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు sk చందు పాషా, కంచర్ల రాఘవేంద్రరావు, దర్శనాల లక్ష్మీనారాయణ, గార్లపాటిశివకృష్ణ, భూక్య బద్రు, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ