Wednesday, 16 September 2026 03:27:50 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి బ్యాంకర్లు సహకరించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 20 September 2025 08:22 PM Views : 464

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా సంబంధిత వర్గాలకు సకాలంలో రుణాలు అందజేసి బ్యాంకర్ లు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రీణాల్ శ్రేష్ట తో కలిసి జిల్లాలో ఉన్న బ్యాంకర్లు , జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వశక్తి సంఘాల రుణాలు రికవరీ, పీఎం స్వానిధి రుణాలు,ఎఫ్.పి.ఒల ఏర్పాటు , ఇతర అంశాల పై డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరం 2291 కోట్ల రూపాయల పంట రుణ లక్ష్యానికి సెప్టెంబర్ చివరి వరకు రూ.409.55 కోట్లు, 1416.09 కోట్ల రూపాయల వ్యవసాయ టర్మ్ రుణాలకు గాను 342.31 ఓట్ల రుణాలు అందించామని అధికారులు తెలిపారు.రైతు రుణాల పంపిణీ అంశంపై బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ పంట రుణాల పంపిణీ గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు. స్వయం శక్తి సంఘాలకు చేపల పెంపకం యూనిట్లు, కౌజు పిట్టల పెంపకం తదితర యూనిట్ల స్థాపనకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని, నిర్దేశించిన లక్ష్యాలకు తక్కువగా రుణాలు అందించిన అన్ని బ్యాంకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న 3 నెలల కాలంలో 500 యూనిట్ల స్థాపనకు బ్యాంకర్లు సహకరించాలని ఆ దిశగా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లక్ష్యసాధనకు బ్యాంకర్లు సహకరించకపోతే ఉపేక్షించేది లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లకు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.గ్రామీణ ప్రాంతంలో బ్యాంకర్లకు అందాల్సిన గ్రూపు వివరాలు వెంటనే అందజేసేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పట్టణాలలో సైతం మెప్మా బృందాల వివరాలు బ్యాంకులకు అందించి రుణాలు మంజూరి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లా ప్రజలు అభివృద్ధి కోసం చేపట్టే యూనిట్ల స్థాపనకు అన్ని బ్యాంకులు సహకరించాలని యూనిట్లు స్థాపించడానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని దానికి అనుగుణంగా రుణ సదుపాయం కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం యూనిట్లని బ్యాంకర్లందరూ సందర్శించే విధంగా ఒకరోజు ప్రణాళిక ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యాచందన, ఎల్ డి ఎం రామ్ రెడ్డి, మెప్మా పీడీ రాజేష్, వివిధ బ్యాంకు మేనేజర్లు , సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :