Friday, 18 September 2026 04:23:46 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

Date : 17 May 2026 11:58 AM Views : 164

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 24 నుంచి జులై 25 వరకు ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ఇంటింటి సర్వే నిర్వహణ ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లాలో జూన్ 24 నుంచి జులై 25 వరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్‌) ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ పురోగతి, ఇంటింటి సర్వే ప్రక్రియపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఐడీఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి సంబంధిత అధికారులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను జూన్ 24 నుంచి జులై 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 15 నుంచి 22 వరకు ఇంటింటి సర్వే ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. జూన్ 24 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలను పంపిణీ చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రజలకు తమ పరిధిలోని బీఎల్ఓల పేరు, మొబైల్ నంబర్, పోలింగ్ కేంద్రం వివరాలు తెలిసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వీఐపీ, వీవీఐపీ ఓటర్ల పేర్ల మ్యాపింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రముఖుల పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడం వంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం-6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, మరణించిన ఓటర్ల వివరాలను ధృవీకరించి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. బదిలీ అయిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను సక్రమంగా పరిశీలించి రికార్డులను నవీకరించాలని తెలిపారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ సమావేశాల మినిట్స్‌ను భద్రపరచాలని సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై బూత్ లెవల్ అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.ఐటీ బృందానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని, బీఎల్ఓలు మొబైల్ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించాలని తెలిపారు. ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. గత సమావేశం నుంచి ఇప్పటివరకు 17 వేల మ్యాపింగ్ పూర్తి చేశామని వెల్లడించారు. జిల్లాలో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం కొనసాగిస్తూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. బీఎల్ఓలకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందిస్తూ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేస్తామని అన్నారు . ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగప్రసాద్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :