Sunday, 02 August 2026 08:00:55 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 23 January 2026 07:56 PM Views : 189

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫిబ్రవరి 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే పవిత్ర రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని, జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన రంజాన్ మాసంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మసీదుల పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, మసీదు ఆవరణల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి పరిశుభ్రతను కాపాడాలని పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే త్రాగునీటి సరఫరా నాణ్యతను మెరుగుపర్చేందుకు బావులు, నీటి ట్యాంకులను శుభ్రపరచి బ్లీచింగ్ పౌడర్ వినియోగించాలని సూచించారు.రంజాన్ మాసంలో ప్రార్థన సమయాలను దృష్టిలో ఉంచుకొని రెండు పూటలా త్రాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి మసీదు పరిధిలోని లైన్‌మన్ ఫోన్ నంబర్లను మసీదు పెద్దలకు అందుబాటులో ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.ప్రార్థనా మందిరాల వద్ద అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్సులు అందుబాటులో ఉండే విధంగా పర్యవేక్షణ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రార్థనా మందిరాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు.రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాలు తదితర నిత్యావసర వస్తువులు సరిపడా అందుబాటులో ఉండేలా డైరీ అభివృద్ధి శాఖ అధికారులతో సమన్వయం చేసి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాలో ఉన్న అన్ని మసీదులు, వాటి మత పెద్దల పూర్తి వివరాలను సంబంధిత శాఖలు సమర్పించాలని కోరారు.రంజాన్ మాసం సందర్భంగా ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు కలగకుండా దుకాణాలు ఎక్కువ సమయం తెరిచి ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు సూచించారు.ప్రశాంతమైన వాతావరణంలో, సామరస్యంతో ప్రజలందరూ ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు, కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్, పోలీస్ శాఖ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు,జిల్లా అదనపు వైద్య అధికారి, కొత్తగూడెం పాల్వంచ ఇల్లందు మణుగూరు మున్సిపల్ కమిషనర్లు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :