తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ, ఆదివారం ఉదయం ప్రగతి మైదానంలో నిర్వహించనున్న “సండే బ్రిక్స్ చాలెంజ్” కార్యక్రమానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లను DRDO శ్రీమతి ఎం. విద్యా చందన ప్రగతి మైదానంలో పరిశీలించి, సంబంధిత అధికారులు, ఉద్యోగులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ హితమైన మట్టి ఇటుకలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమకు ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ—ఇవి మూడూ ఇందులో భాగం అవుతాయి” అని తెలిపారు. పోటీలో పాల్గొన్న ఉత్తమ ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ , డిపిఎంలు, ఏపీఎంలు, డీఈఓ కార్యాలయానికి చెందిన సీఎంఓలు, మున్సిపాలిటీ మరియు మేప్మా సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ