తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం పట్టణంలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎంపీ కాలనీకి చెందిన 9వ తరగతి బాలిక (14) తన తల్లి విజయలక్ష్మితో కొన్ని రోజులుగా గొడవ పడుతోంది. తల్లితో గొడవను తట్టుకోలేక మనస్తాపం చెందిన ఆ బాలిక క్షణికావేశంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ