తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : బ్లాక్ మనీ పేరుతో రూ.13 లక్షలు మోసం చేసిన నిందితుడు అరెస్ట్ – మోసానికి ఉపయోగించిన బ్లాక్ పేపర్లు, రసాయన ద్రావణాలు స్వాధీనం.అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న పత్తిపాటి ప్రేమ్ చందు అనే నిందితుడిని అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు.బ్లాక్ పేపర్లను ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచితే రూ.500 నోట్లుగా మారుతాయని నమ్మించి, రూ.11 లక్షలు తీసుకున్నట్లు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తంరూ.13 లక్షలుఅశ్వారావుపేటకు చెందిన మదుబాబు ను మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు.నిందితుడు గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్ సైకీళ్ళ దొంగతనంమరియు ఇతర కేసుల్లో బాచుపల్లి, రామచంద్రపురం మరియు కూకటపల్లి పోలీస్ స్టేషన్లలో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది.నిందితుడి వద్ద నుండి మోసానికి ఉపయోగించిన క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20,000 బ్లాక్ పేపర్లు (20 కట్టలు)బ్లాక్ పేపర్లను నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించినరెండు రసాయన ద్రావణాల సీసాలు నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి, అరెస్ట్ చేయడం జరిగింది.ప్రజలకు విజ్ఞప్తి:బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను నమ్మవద్దు. ఇటువంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని అశ్వారావుపేట పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ