Thursday, 17 September 2026 07:10:45 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

సమీకృత వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. ములకలపల్లి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన..

Date : 21 October 2025 07:39 PM Views : 407

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమీకృత వ్యవసాయం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు . మంగళవారం ఆయన ములకలపల్లి మండలంలోని పలు గ్రామాలను విస్తృతంగా పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా రాజుపేట గ్రామంలో చింతకాయల నాగేశ్వరరావు, కుమారి దంపతులు నిర్వహిస్తున్న కౌజు పిట్టల యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు. మండల సమైక్య సహాయంతో రుణం పొందిన రైతు, కౌజు పిట్టలతో పాటు నాటు కోళ్లు మరియు మేకల పెంపకం చేపడుతున్నట్టు కలెక్టర్‌కు వివరించారు. రైతు తెలిపిన ప్రకారం, 300 కౌజు పిట్టల పెంపకం చేపట్టామని ఇప్పుడు పంట చేతికి వచ్చిందని దీని ద్వారా నెలకు సుమారు 15,000 ఆదాయం పొందుతామని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న సంవత్సరంలో జిల్లాలో 500 చేపల పెంపక యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, చేపల పెంపకంతోపాటు అదే ప్రాంగణంలో కౌజు పిట్టలు, నాటు కోళ్లు, మేకల పెంపకం వంటి సమీకృత వ్యవసాయ విధానాలను అమలు చేయడం ద్వారా చేపల పంట చేతికి వచ్చేంతవరకు రైతులు నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఈ ఆదాయాన్ని రైతులు చేపల పెంపకానికి తీసుకున్న రుణాలకు ఈఎంఐగా చెల్లించడం ద్వారా ఆర్థికభారం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే, రైతు పామాయిల్ సాగులో అంతర్పంటగా మునగ సాగు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.తదుపరి పూసగూడెం గ్రామంలోని డంపింగ్ షెడ్లో గ్రామపంచాయతీ వర్కర్లు తయారు చేస్తున్న బయోచార్ (జీవ బొగ్గు) తయారీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఎండిన చెట్ల కొమ్మలు, తుమ్మ వంటి పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి మంట ద్వారా బయోచార్ తయారుచేసే విధానాన్ని సమీక్షించారు.కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విధంగా తయారైన బయోచార్‌ను గోమూత్రం మరియు గోవుపేడలో కొన్ని రోజులు నానబెట్టి ఆరబెట్టి పొడిచేసి పంటలకు సేంద్రియ ఎరువుగా వాడితే భూసారం మెరుగుపడి అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు. గ్రామపంచాయతీలు చెత్త సేకరణ సమయంలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ఆయన ఆదేశించారు. డంపింగ్ యార్డుల్లో తయారైన కూరగాయ వ్యర్థాల కంపోస్ట్ ఎరువును కూడా పరిశీలించారు.అనంతరం కలెక్టర్ పాతగంగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణవాటికను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో ముచ్చటించి, వారికి అందిస్తున్న ఆహారం గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణవాటిక ఏర్పాటు చేసి, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలు, కూరగాయలు ఉచితంగా అందిస్తున్నారని సిబ్బంది వివరించారు.కేంద్రంలో పెంచిన ఆరు రకాల ఆకుకూరలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఆకుకూరలు ఒకేసారి కాకుండా వారానికోసారి మారుస్తూ అందుబాటులో ఉంచాలని సూచించారు. మునగ, వెలగా, చింత, ఉసిరి, కరివేపాకు వంటి మొక్కలను కూడా పెంచాలని సూచించారు.కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణీల కోసం ప్రత్యేకంగా పోషకవాటికలను అభివృద్ధి చేయడం ద్వారా వారికి సమృద్ధమైన పోషకాహారం అందించవచ్చని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, తాసిల్దార్ గన్యా నాయక్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :