Wednesday, 16 September 2026 09:52:58 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భద్రాచలంలో ప్రారంభమైన మహాసభలు.ఆయుర్వేద వైద్యులంతా ఏకమవ్వాలి. హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు

Date : 08 September 2026 07:47 PM Views : 520

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వంశపారంపర్యంగా వైద్యం చేసే అందరూ ఏక తాటిపైకి నడిచి, ఆయుర్వేదాన్ని మరింత బలోపేతం చేయాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. పారంపర్య వైద్య మహా సంఘం (పివిఎంఎస్) మూడవ రాష్ట్ర మహాసభలు భద్రాచలంలోని, భక్త మార్కండేయ భవన్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత మహాసభలకు ముందు ఆయుర్వేదానికి మూలపురుషుడైన ధన్వంతరిని స్మరించుకుంటూ, జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ...భారతీయ సనాతన ఆయుర్వేద సిద్ధ వైద్య విధానాలు మన దేశం అంతటా వేల సంవత్సరాల నుంచి విస్తరించి ఉన్నాయన్నారు. దేశం పట్ల, దేశ ప్రజల పట్ల, అంకితభావం కలిగిన వైద్యులను వెలికి తీయాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. మరుగున పడిన వైద్య గ్రంథాలను వెలు గులోకి తీసుకొచ్చి, వైద్యులందరినీ ఏకతాటిపై నడిపించడమే మహాసభలు ఉద్దేశమని తెలియజేశారు. ఔషధము లేని వ్యాధి ఉండకుండా, అంటే ప్రతి వ్యాధికి ఔషధం ఉండే విధంగా రూపకల్పన చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడిన వారిలో భారత ధర్మ దేవత బ్రహ్మచారి శివ స్వామి (శివ క్షేత్ర పీఠాధిపతి), మానవీయ వైద్య జమాల్ ఖాన్, రామడుగు వీరభద్ర చారి, పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య లతో పాటు ఆంధ్రప్రదేశ్, మదురై, ఛత్తీస్గడ్, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు లనుండి ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర అధ్యక్షులు దొంత యాత్రి మహా ఋషి, ఉపాధ్యక్షులు రామంచి శ్రీనివాస్, సిహెచ్ భాను ప్రసాద్, కోశాధికారి తోవేటి దుర్గారాణి, ఎస్కే వాహిద్ అలీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్, జి.సుగుణారావు, కొ-కన్వీనర్ నాగేశ్వరరావు, తూము రమేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా వేదిక మీద ఆసీనులైన వైద్యులకు ప్రకృతి ప్రేమికురాలు, హరిత దీక్షకురాలు చిన్నారి నైనిక రజవా మొక్కలను అందించి పలువురు ప్రశంసలు అందుకున్నారు. కాగా మహాసభలకు 500 రకాల ఔషధ మొక్కలను స్టాల్లో ఏర్పాటుచేసిన మొక్కల వెంకటయ్యను పలురు వైద్యుల అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :