తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 12 తెలుగు వెలుగు) : అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో మంగళవారం మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం చోటుచేసుకుంది. పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహాన్ని తీసివేసి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఓ మూలకి గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. విగ్రహాన్ని తొలగించిన వారిని చట్ట పరంగా శిక్షించాలని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ