తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోడ్లపై అనుమతులు లేకుండా వెలుస్తున్న ఫ్లెక్సీలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్తగూడెం డీఎస్పి షేక్ అబ్దుల్ రహమాన్ బుధవారం లేఖను రాశారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా ఇస్తానుసారంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అధికారులు స్పందించి వెంటనే అనుమతులు లేని హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై అనుమతులు లేకుండా రోడ్లపై, డివైడర్ల మధ్య ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ ల వల్ల ఏదైనా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే అవి ఏర్పాటు చేసిన వారిపై, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పి షేక్ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ