Thursday, 05 November 2026 11:23:28 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రూల్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయొద్దు, TUCI, డిమాండ్.

Date : 28 March 2026 07:30 PM Views : 294

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4,లేబర్ కోడ్స్ రూల్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయొద్దని TUCI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు డిమాండ్ చేశారు.ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా , ఈనెల 30న జిల్లా కేంద్రాలు జరుగుతున్న లేబర్ కోడ్ ప్రతుల దగ్ధం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని చంద్రుగొండ ఆటో అడ్డ వద్ద పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గోపాలరావు పాల్గొని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్,ను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయొద్దన్నారు. జరుగుతున్న శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. 1)పారిశ్రామిక సంబంధాల కోడ్, 2) వేతన కోడ్, 3) సామాజిక భద్రత కోడ్, 4) వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ ఈ నాలుగు లేబర్ కోడ్స్,కార్మికులకు తీవ్రమైన నష్టదాయకమన్నారు. ఈప్రతులను తగలబెట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు నిరసన తెలియజేయడానికి ఈనెల 30న జిల్లా సెంటర్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు రాయల సిద్దు, వీరభద్రం, అరుణ్ సురేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :