తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమాజంలో ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని చదువే మనిషికి ఆస్తి అని దేవుడిచ్చిన వరం అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని దంతేల బోర గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది కాటూరి సంజీవరావు కుమార్తె కాటూరి బిందు న్యాయవాద విద్యను అభ్యసించి తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. పాల్వంచ మునిసిపాలిటీ పరిధిలోని ఇందీరాకాలనీ లోని సంజీవరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సివిల్ జడ్జిగా ఎంపికైన బిందు ని కొత్వాల శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామంలో పుట్టి న్యాయవాద వృత్తి చేపట్టి జడ్జి స్థాయికి ఎదిగిన బిందు అభినందనీయురాలని ఆమె మరెన్నో పదవులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ఎర్రం శెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు ఉండేటి శాంతి వర్ధన్, కొత్తపల్లి సోమయ్య, కాపర్తి వెంకటాచారి, అలెక్స్, కటుకూరి శేఖర్, కొత్తపల్లి రవి, షేక్ బాషా, జగన్నాథం అజిత్, చింతలచెరువు రమేష్, సైదులు, చింతలచెరువు వేణు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ