తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : ఖమ్మం నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతండ గ్రామా మాజీ సర్పంచ్ భర్త ఆజ్మీర బాల్య, (50) అయన కుమారుడు సాయి కుమార్, (18) ఖమ్మం నగరంలో గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఖమ్మం వెళ్లిన తండ్రి కొడుకులను లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి పై లారీ టైర్ ఎక్కడంతో బాడీ నుజ్జునుజ్జయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ