Tuesday, 03 November 2026 11:31:25 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు అధికారులకు,సిబ్బందికి ఉచిత కంటి పరీక్షల శిబిరంలో పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

Date : 17 October 2025 07:50 PM Views : 462

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కంటి చూపును కాపాడుకోవడానికి సరైన పోషకాహారం తీసుకోవడం,స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,సరైన లైటింగ్‌లో పనిచేయడం వంటివి ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అధికారులు,సిబ్బంది మరియు వారి కుటుంబాలకు ఉచితంగా కంటి పరీక్షల మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.శరత్ మాక్సివిజన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కొరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి శరీరంలోని అన్ని అవయవాలలో కళ్ళు చాలా ప్రధానమైనవి అని అన్నారు.ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగం ఎక్కువ కావడం ద్వారా మన కంటి చూపులో సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ కంటి చూపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వీలైనంత తక్కువగా మొబైల్ ఫోన్ వాడుతూ,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వైద్యులు సూచించినట్లుగా పరీక్షలు చేయించుకుని కంటి చూపు లోపాలు లేకుండా చికిత్సలు చేయించుకోవాలని తెలిపారు.ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కంటిచూపును ఎప్పటికప్పుడు సరిగ్గా కాపాడుకోగలిగితేనే మన దైనందిన కార్యక్రమాలను సరిగ్గా చేసుకోగలమని తెలిపారు.పోలీసు అధికారులు,సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు.అనంతరం ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మందికి పైగా కంటి పరీక్షలు (స్క్రీనింగ్,డిస్టెన్స్ విజిబిలిటీ టెస్ట్) చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణతో పాటు ఆర్ఐలు సుధాకర్,నరసింహారావు,కృష్ణారావు,లాల్ బాబు మరియు ఇతర అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :