తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళా శక్తి భవనం మహిళల శిక్షణ, సాధికారతకు వేదికగా నిలవాలి : కమిషనర్ దివ్య దేవరాజన్. నిర్మాణ పనుల్లో నాణ్యత, భవిష్యత్ నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి.నూతన జిల్లాకు ఈ భవనం మంచి వరం – విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాన్ని పంచాయతీరాజ్, ప్రజావాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల కమిషనర్ దివ్య దేవరాజన్ మంగళవారం పరిశీలించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ అంకిత్ పూల మొక్క అందించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కమిషనర్ భవనంలోని వివిధ విభాగాలు, శిక్షణ హాళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనంలో 100 మంది, 40 మంది సామర్థ్యంతో రెండు శిక్షణ హాళ్లు ఉన్నాయని అధికారులు వివరించారు. మహిళల నైపుణ్యాభివృద్ధి, సాధికారతకు సంబంధించిన వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కమిషనర్ తెలిపారు .భవనం నిర్మించడం ఎంత ముఖ్యమో, దానిని భవిష్యత్‌లో సమర్థవంతంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమని దివ్య దేవరాజన్ అన్నారు. భవనాన్ని సాధ్యమైనంత ఎక్కువగా శిక్షణ కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. మహిళల కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. నూతన జిల్లాకు ఇలాంటి భవనం మంచి ఆస్తి, వరం వంటిదని అన్నారు .భవన నిర్మాణం మంచి ప్రణాళికతో చేపట్టినట్లు తెలిపిన కమిషనర్, నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భవనం పూర్తయిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు నాణ్యతతో ఉండేలా పనులను పూర్తి చేయాలని, లీకేజీలు, డ్యాంప్‌నెస్ వంటి సమస్యలు తలెత్తకుండా నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భవనానికి అవసరమైన కాంపౌండ్ వాల్ పనులను కూడా ప్రతిపాదనల మేరకు పూర్తి చేయాలని సూచించారు.భవనానికి సంబంధించిన ఫినిషింగ్ పనులను నాణ్యతతో పూర్తి చేయడంతో పాటు ఆకర్షణీయమైన రంగులను వినియోగించాలని కమిషనర్ సూచించారు. మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా భవనంలోని అన్ని పనులను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి అనూష, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ