Friday, 18 September 2026 01:15:24 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

పర్యాటక ప్రాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 21 May 2026 01:44 PM Views : 150

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యాటక వారోత్సవాల్లో భాగంగా గోడపత్రిక ఆవిష్కరణ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఐడిఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సహజ సిద్ధమైన అటవీ ప్రాంతాలు, జలాశయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యావరణ పర్యాటక ప్రాంతాలు విస్తారంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కిన్నెరసాని, భద్రాచలం దేవస్థానం, తుమ్మలచెరువు, బెంగాలపాడు, పర్ణశాల తదితర ప్రాంతాలను సోషల్ మీడియా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ వీడియోలు, ఫొటోలు, ప్రత్యేక కథనాల ద్వారా పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, చిన్న వ్యాపారులు, హస్తకళాకారులు, గిరిజన ఉత్పత్తుల విక్రేతలకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు . జిల్లాలోని పర్యాటక ప్రదేశాల సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, చారిత్రక విశేషాలను ఆకర్షణీయంగా ప్రజలకు చేరవేస్తే మరింత మంది పర్యాటకులు జిల్లాకు వచ్చే అవకాశముందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పర్యాటక ప్రాంతాల ప్రచారం వేగంగా విస్తరిస్తోందని, యువత ఎక్కువగా డిజిటల్ వేదికలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ, స్థానిక సంప్రదాయాలకు గౌరవం కల్పించేలా ప్రచారం చేయాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి పర్యాటక ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పర్యాటక వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశేషాలు, చారిత్రక ప్రాధాన్యత, సందర్శనీయ స్థలాల వివరాలతో రూపొందించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యటక శాఖ, జిల్లా క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి , వివిధ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :