Saturday, 19 September 2026 05:56:05 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్

Date : 17 July 2026 04:55 PM Views : 206

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతిరోజు మెనూ సక్రమంగా అమలు చేయాలి జిపిఎస్ పాఠశాల చిన్నారులకు ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ సక్రమంగా చేయించాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు చక్కటి విద్యాబోధనతో పాటు మెనూ ప్రకారం సమయానుకూలంగా ఆహారము వేడిగా ఉన్నప్పుడే అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం నాడు సుజాతనగర్ మండలంలోని సర్వారం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, డార్మెటరీ రూమ్, స్టోర్ రూమ్, పరిసరాలు మరియు వంటశాలను ఆయన పరిశీలిచారు. ఈ సందర్భంగా కాసేపు ఉపాధ్యాయుని పాత్ర పోషించి ప్రాథమిక స్థాయి విద్యార్థులతో ఉద్దీపకం వర్క్ బుక్ లోని గణితం మరియు ఆంగ్లంలో వివిధ రకాల పదాలను గుణకారాలు, బాగాహారాలను పిల్లల చేత బోర్డుపై వ్రాయించి ఇంగ్లీష్ వర్క్ బుక్ లోని పదాలను పిల్లల చేత చదివించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులలో ఇండ్లకు వెళ్లిన పిల్లలు ఉద్దీపకం వర్క్ బుక్ లోని కొన్ని పదాలు చతుర్వేదికలు, కూడికలు, తీసివేతలు, బాగాహారాలు చేయడంలో కాస్త వెనుక పడ్డట్టు కనిపిస్తున్నారని, ప్రతిరోజు వారికి హోంవర్క్ తో పాటు వర్క్ బుక్ లోని ప్రతి అంశం పిల్లల చేత రాయించి చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గత పదవ తరగతి ఫలితాల్లో ఈ పాఠశాలలో రిజల్ట్ తక్కువ శాతం వచ్చిందని, పదవ తరగతి విద్యార్థులను పరీక్షల చివరి 100 రోజుల వరకు వేచి ఉండకుండా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే క్రమబద్ధమైన కార్యచరణ ప్రణాళికతో ప్రతిరోజు చదివేలా చూడాలని, విద్యార్థులు కూడా నిరంతర సాధన క్రమశిక్షణ మరియు లక్ష్యంతో కూడిన ప్రణాళికే అత్యుత్తమ ఫలితాలకు మార్గం సుమగమవుతుందని విద్యార్థులకు సూచించారు. ఈ సంవత్సరం ఈ పాఠశాల పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులతో విద్యార్థులందరూ పాసయ్యేలా ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకోవాలని అన్నారు.అలాగే ఉన్నత విద్యా మరియు భవిష్యత్తు ఉద్యోగాల అవకాశాల కోసం ఇప్పటినుంచే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. వర్షాకాలం నడుస్తున్నందున పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్తాచెదారం పిచ్చి మొక్కలు సైడ్ కాలువలలో పూడికలు తీయించి వర్షపు నీరు బయటకు వెళ్ళిపోయేలా చూడాలని నీరు నిల్వ ఉండటం వలన దోమలు ప్రబలి విద్యార్థులు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ఏఎన్ఎం 24 గంటలు పిల్లలకు అందుబాటులో ఉండాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ప్రతిరోజు మెనూ ప్రకారం సమయానుకూలంగా భోజనాలు పెడుతున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ టి డి ఓ చంద్రమోహన్,హెచ్ఎం సునీత, వార్డెన్ తారాచంద్ మరియు ఎస్ సి ఆర్ పి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :